కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో చెట్ల నరికివేతపై కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సత్యనారాయణ విచారణ చేపట్టారు. వర్సిటీలో మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేతపై ‘వీ6, వెలుగు’లో 'క్యాంపస్ కన్నీరు' హెడ్డింగ్ తో పబ్లిష్ అయిన కథనం, విద్యార్థుల ఫిర్యాదుతో ఆఫీసర్లు స్పందించారు. యూనివర్సిటీలో చెట్లు నరికిన ప్రాంతాన్ని డీఎఫ్వో, ఫారెస్ట్ సిబ్బందితో కలిసి మంగళవారం పరిశీలించారు. మట్టి తవ్విన ప్రాంతంతోపాటు హాస్టల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల కూడా పదుల సంఖ్యలో చెట్లు నరికినట్లు గుర్తించారు.
ఈ విషయమై డీఎఫ్వో ‘వెలుగు'తో మాట్లాడుతూ యూనివర్సిటీలో చెట్ల నరికివేతపై ఎంక్వైరీ చేశామని, అవసరం లేకపోయినా చెట్లు నరికేసినట్లు గుర్తించామని తెలిపారు. చెట్ల నరికివేతకు తాము ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని, రెండు, మూడు రోజుల్లో కొట్టేసిన చెట్లను ఎన్యుమరేట్ చేసి లెక్కకడుతామని వెల్లడించారు. యూననివర్సిటీ ఆఫీసర్లకు వాల్టా, ఫారెస్టు చట్టాల ప్రకారం నోటీసులు ఇచ్చి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని, బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
