కరీంనగర్‎లో సైబర్ ఫ్రాడ్.. రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుంచి రూ.10 లక్షల కొట్టేసిన కేటుగాళ్లు

కరీంనగర్‎లో సైబర్ ఫ్రాడ్.. రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుంచి రూ.10 లక్షల కొట్టేసిన కేటుగాళ్లు

కరీంనగర్‎లో సైబర్ ఫ్రాడ్ తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.10 లక్షల 80 వేలు కాజేశారు సైబర్ మోసగాళ్లు. వివరాల ప్రకారం.. మురళీధర్ రావు రిటైర్డ్ ఇరిగేషన్ ఉద్యోగి. నవంబర్ 1వ తేదీన ఆయనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లైఫ్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలంటూ మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్‎కు సంబంధించిన వివరాలు కూపీ లాగారు. 

సైబర్ నేరగాళ్లు మాటలు నమ్మిన మురళీధర్ రావు కొన్ని వివరాలు వారికి చెప్పాడు. ఆ తర్వాత అనుమానం రావడంతో అప్రమత్తమయ్యాడు. ముందు జాగ్రత్తలో భాగంగా తన అకౌంట్లోని రూ.20 లక్షల 80 వేలల్లో రూ.10 లక్షలు తన భార్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మురళీధర్ రావు అకౌంట్లోని మిగతా రూ.10 లక్షల 80 వేలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. 

మోసపోయినని గ్రహించిన మురళీధర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‎ని కలిసి వేడుకున్నాడు బాధితుడు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‎కు రెస్పాండ్ కావొద్దని.. బ్యాంక్ అకౌంట్, ఇతర వ్యక్తిగత వివరాలను అపరిచిత వ్యక్తులతో షేర్ చేసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.