రాయికల్, వెలుగు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్పూర్లో గోండు ఆదివాసీలు తమ ఆరాధ్య దైవం హేత్మను సంప్రదాయబద్ధంగా పూజించి గుస్సాడ్ దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, నెమలి ఈకల అలంకరణలు, డప్పుల మోతల మధ్య ప్రదర్శించిన గుస్సాడ్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సర్పంచ్ పరచ శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కులదైవం హేత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ‘నేను సైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్’ అధినేత రామకృష్ణ చారి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఉత్సవాల్లో పాల్గొన్నది. కార్యక్రమంలో ఫ్యాకల్టీ మండలోజు శ్రీనివాస్, ట్రస్ట్ డైరెక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి, ఇరుకుల వీరేశం నేత, సీనియర్ ఛాయాచిత్రకారుడు దురిశెట్టి శ్రీనివాస్, వరంగల్ ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
