డిసెంబర్ 4న టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి.. వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా..?

డిసెంబర్ 4న టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి.. వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా..?

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి డిసెంబర్ 4న లక్నోలో జరగనుంది. రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను 2026 డిసెంబర్ 4న లక్నోలో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 2025 జూన్‌లో క్రికెటర్లు, పలువురు ప్రముఖులు హాజరైన వేడుకలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. యూపీలోని మచ్చలిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియా, రింకుల వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇప్పటికే ప్రింట్ అయ్యాయి.

ఈ పెళ్లి వేడుక రామాడా బై విండమ్ లక్నో హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ నెల చివరలో దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ కోసం రింకూ సింగ్ వెళ్లాల్సి ఉంది. ఈ లోపు పెళ్లికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని రింకూ డిసైడ్ అయి అప్పుడే పెళ్లి పనులు మొదలుపెట్టేశాడు. దీపావళి సందర్భంగా తన సొంతూరైన అలీగఢ్‌కు వెళ్లి, తన కుటుంబంతో మధుర క్షణాలను గడుపుతూనే.. పెళ్లి ఏర్పాట్లను కూడా చూసుకున్నాడు.

2026 ఫిబ్రవరిలో రింకు సింగ్ తండ్రి మరణించాడు. ఇలా రింకూ జీవితంలో ఊహించని విషాదం అలుముకుంది. అందువల్లే పెళ్లికి ఇరు కుటుంబాలు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నాయి. అలీగఢ్ నుంచి సుమారు 100 మంది అతిథులు రింకూ వివాహానికి హాజరవుతారని అంచనా. ఆహ్వానితుల జాబితాలో రాజకీయ నాయకులు, సమాజంలోని ప్రముఖ వ్యక్తులు, స్నేహితులు ఉన్నారు.

ప్రస్తుతం కుటుంబ సభ్యులు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇచ్చే పనిలో ఉన్నారు. రింకు సింగ్ తన పెళ్లికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని నిర్ణయించాడు. అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత అతను తన తల్లి, సోదరుడితో కలిసి ముఖ్యమంత్రిని కలవనున్నాడు.  నవంబర్ 14 లేదా 15 తేదీలలో యూపీ సీఎంకు తన వెడ్డింగ్ ఇన్విటేషన్ను ఇచ్చి  రింకూ సింగ్ పెళ్లికి ఆహ్వానించనున్నాడు