డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనీ వెబ్ సైట్లు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడం ఈజీ అయింది. జీవిత భాగస్వామిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అనే విషయంలో ఈ కాలం అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచనలు మారుతున్నాయి. చాలామంది ఆన్ లైన్ చాటింగ్ చేసి, అవతలి వాళ్ల మీద ఒక అంచనాకి వస్తున్నారు. సొంతంగా డెసిషన్ కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు తమకి అన్ని విధాలా మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరికేంత వరకు కాంప్రమైజ్ అవ్వట్లేదు.
ఈ జనరేషన్ వాళ్లలో 67 శాతం మంది డేటింగ్ యాప్స్ ద్వారానే తమకి సరైన జోడిని వెతుక్కుంటున్నారు. ఈరోజుల్లో అమెరికాలోని ప్రతి మూడు జంటల్లో ఒకరు డేటింగ్ యాప్స్ ద్వారానే ఒక్కటవుతున్నారు. మనదేశంలో కూడా ఇదే తీరు కనిపిస్తోంది. ఆన్ లైన్ డేటింగ్ సాయంతో తాము కోరుకున్న క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం పెరిగింది అని ఈతరం భావిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారివారి ఇష్టాలు, ప్రిఫరెన్స్లకు సరిపోయే వ్యక్తిని వెతకడం మరింత సులువైంది. డేటింగ్ యాప్లో కోరుకునే వ్యక్తి వయసు, ఎత్తు, ఎక్కడ ఉంటారు? ఎంత చదువుకున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? వంటి వివరాలు చెబితే చాలు... మ్యాచ్ అయిన అమ్మాయి లేదా అబ్బాయిల ప్రొఫైల్ కనిపిస్తుండటమే ఇందుకు కారణం.
