న్యూజీలాండ్తో మ్యాచ్ రద్దు.. బుమ్రా, జడేజాకు నిరాశ

న్యూజీలాండ్తో మ్యాచ్ రద్దు..  బుమ్రా, జడేజాకు నిరాశ

లింకన్‌‌‌‌‌‌‌‌: చివరి రెండు రోజుల ఆట వరుణుడి ఖాతాలోకి వెళ్లడంతో.. ఇండియా–ఎ, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌–ఎ జట్ల ముగిసిన మూడో అనధికార టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ డ్రా అయ్యింది. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇరుజట్లు 0–0తో సమంగా నిలిచాయి. అయితే కివీస్‌‌‌‌‌‌‌‌తో టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ను ఆశించిన టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తీవ్రమైన నిరాశ ఎదురైంది. 

గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువసేపు బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలని భావించినా.. వర్షం వల్ల అది సాధ్యపడలేదు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3న ఆసియా క్రీడల్లో పాక్‌‌‌‌‌‌‌‌పై ఫైనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడిన బుమ్రా అప్పట్నించి రెస్ట్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాడు. కివీస్‌‌‌‌‌‌‌‌తో టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం అతన్ని రెడీగా ఉంచేందుకు ప్రస్తుత వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లోనూ అవకాశం ఇవ్వలేదు. మొత్తానికి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆరు ఓవర్లు బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన బుమ్రా 11 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా ఒక్క వికెట్‌‌‌‌‌‌‌‌ కూడా తీయలేదు. గంటా 20 నిమిషాలు క్రీజులో గడిపిన జడేజా 71 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 25 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం దక్కలేదు. 

ఈ ఇద్దరితో పాటు యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌, దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌ వెల్లింగ్టన్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించకపోతే ఆరు సెషన్ల పాటు వీళ్లకు ఫుల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ లభించనుంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 464/5 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేయగా, కివీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 36/2 స్కోరు చేసింది.