రావల్పిండి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక కష్టాల్లో పడింది. లాహిరు ఉడార (42), కమింద్ మెండిస్ (40 బ్యాటింగ్) మోస్తరుగా ఆడటంతో.. మంగళవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు లంక తొలి ఇన్నింగ్స్‌లో 27.1 ఓవర్లలో 114/3 స్కోరు చేసింది. ధనంజయ డిసిల్వా (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పసిందు సూరియబండార (0), దినేష్ చండిమల్ (1) నిరాశపర్చారు. సకీబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.
అంతకుముందు 281/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 106.3 ఓవర్లలో 434/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. గాజి ఘోరి (48), అరాఫత్ మిన్హాస్ (52) రాణించారు. అసితా ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక చెరో మూడు వికెట్లు తీశారు. ప్రస్తుతం లంక ఇంకా 320 రన్స్ వెనకబడి ఉంది.
