గోల్డ్ వచ్చినా.. ఒలింపిక్ కోటా దక్కలేదు

గోల్డ్ వచ్చినా.. ఒలింపిక్ కోటా దక్కలేదు

దోహా: ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా విమెన్‌‌‌‌‌‌‌‌ షూటర్లు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసినా... 2028 లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ కోటాను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ (590)–మను భాకర్‌‌‌‌‌‌‌‌ (587)–దివ్య సుబ్బరాజు (584)తో కూడిన ఇండియా త్రయం మొత్తం 1761 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 

సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా (1748), వియత్నాం (1745) వరుసగా సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ నెగ్గాయి. వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ (11 పాయింట్లు) ఎనిమిదో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకోగా, మను (27) నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. దాంతో ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ కోటా అవకాశాలను చేజేతులా వృథా చేసుకున్నారు. యాంగ్‌‌‌‌‌‌‌‌ జిన్‌‌‌‌‌‌‌‌ (సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా, 44) వరల్డ్ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది.

 ట్రిన్‌‌‌‌‌‌‌‌ థు విన్‌‌‌‌‌‌‌‌ (వియత్నాం, 43), జాంగ్‌‌‌‌‌‌‌‌ యుయు (చైనా, 34) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. ఈ ముగ్గురు తమ దేశాల తరఫున ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ జైపాల్‌‌‌‌‌‌‌‌ మాల్వియా ఇప్పటికే ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ కోటాను దక్కించుకున్నాడు.