- వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రండి
- డీజీపీ సీవీ ఆనంద్ పిలుపు
- సైబరాబాద్‌లో భరోసా కేంద్రం ప్రారంభం
గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ పరిధిలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని, దానికి పరిష్కారం కనుక్కునేందుకు ఈ నెల 26 నుంచి 28 వరకు సైబరాబాద్ మూవ్స్ పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్వెల్లడించారు. మంగళవారం సైబరాబాద్‌లో నూతన భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఐటీ సంస్థలు, దవాఖానలున్న ప్రాంతాల్లో రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ఐటీ కంపెనీలతో పాటు దవాఖానలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజా రవాణా సంస్థలకు చెందిన నిర్వాహకులు, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్‌పూలింగ్, పబ్లిక్ట్రాన్స్పోర్ట్వినియోగం, ఉద్యోగుల ప్రయాణ సమయాల నిర్వహణపై వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. అలాగే, పోలీసు స్కూల్అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో సహకరించాలని కోరారు. ఏడేండ్ల నిరీక్షణ తర్వాత సైబరాబాద్భరోసా కేంద్రం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు.
డీజీపీ వేసిన పునాదులే : సీపీ రమేశ్
సైబరాబాద్ సీపీ రమేశ్ మాట్లాడుతూ 2013-–16 మధ్య సైబరాబాద్ సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్ వేసిన పునాదులే నేడు సమర్థవంతమైన పోలీసు వ్యవస్థలుగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. సీసీటీఎన్‌ఎస్, ఈ- సాక్షి, ఐసీజేఎస్ వంటి సాంకేతిక వ్యవస్థల వినియోగంతో దర్యాప్తులో పురోగతి సాధించామని, కేసుల శిక్షల రేటు గతంలో 22 శాతంగా ఉండగా ప్రస్తుతం 42 శాతానికి పెరిగిందన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ జాయింట్ సీపీ సన్ ప్రీత్ సింగ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, డీసీపీలు, భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
