ఆర్యవీర్ అదరహో.. అండర్–19 ఆసియా కప్లో చెలరేగిన సెహ్వాగ్ తనయుడు

ఆర్యవీర్ అదరహో.. అండర్–19 ఆసియా కప్లో చెలరేగిన సెహ్వాగ్ తనయుడు

అల్‌‌‌‌‌‌‌‌ అమేరత్‌‌‌‌‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆర్యవీర్‌‌‌‌‌‌‌‌ సెహ్వాగ్‌‌‌‌‌‌‌‌ (168 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 17 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 160) చెలరేగడంతో... అండర్‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా కుర్రాళ్లు సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. వీకే వినీత్‌‌‌‌‌‌‌‌ (67) కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 70 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో యూఏఈ అండర్‌‌‌‌‌‌‌‌–19 జట్టుపై అద్భుత విజయం సాధించింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 309/7 స్కోరు చేసింది. 62 రన్స్ వద్ద కెప్టెన్‌‌‌‌‌‌‌‌ లక్ష్య రాయ్‌‌‌‌‌‌‌‌చందానీ (17) ఔటైనా.. ఆర్యవీర్‌‌‌‌‌‌‌‌ యూఏఈ బౌలర్లను దంచికొట్టాడు. 

వినీత్‌‌‌‌‌‌‌‌తో కలిసి రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 193 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. యశ్‌‌‌‌‌‌‌‌వర్ధన్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ (17), అన్వయ్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ (12) మోస్తరుగా ఆడారు. నసీమ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు తీశాడు. తర్వాత యూఏఈ 50 ఓవర్లలో 239 రన్స్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. అహ్మద్‌‌‌‌‌‌‌‌ ఖుదాబాద్‌‌‌‌‌‌‌‌ (74), నూరుల్లా అయోబీ (39), యాలిన్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ (29) ఫర్వాలేదనిపించారు. ఇషాన్‌‌‌‌‌‌‌‌ సూద్‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు పడగొట్టాడు. గురువారం జరిగే సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది.