వెనిస్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటింగ్ లెజెండ్ క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టనున్నాడు. ఇటాలియా టీ10 లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్ ఫ్రాంచైజీ తరఫున గేల్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని, ఇటలీ ఫ్యాన్స్‌ను అలరిస్తానని గేల్ అన్నాడు. అత్యున్నత స్థాయిలో ఆటపై గేల్‌కు ఉన్న అనుభవం, అవగాహన తమ జట్టుకు గణనీయమైన లాభాన్ని చేకూరుస్తుందని టీమ్ డైరెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ అన్నాడు. గేల్‌కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందన్నాడు.
