జెనీవా: ఫిఫా ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘వరల్డ్ ఎలెవన్’ జట్టులో.. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి మరోసారి చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 20 వేల మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు ఓటింగ్ ద్వారా ఈ తుది జట్టును ఎంపిక చేశారు. 39 ఏళ్ల మెస్సీ తన కెరీర్‌లో ఈ ఫిట్ సాధించడం ఇది 18వ సారి. మెన్స్ వరల్డ్ ఎలెవన్ టీమ్‌లో మెస్సీతో పాటు కైలియన్ ఎంబాపే, ఎర్లింగ్ హాలాండ్, లమిన్ యమల్ ఉన్నారు.
బ్యాలెన్ డి ఓర్ అవార్డు విన్నర్ హ్యారీ కేన్‌కు ప్లేస్ లభించలేదు. యూరప్ వెలుపల క్లబ్ తరఫున ఆడుతూ ఈ జట్టులో స్థానం దక్కించుకున్న ఏకైక ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. విమెన్స్ విభాగంలోనూ స్పానిష్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా కొనసాగింది. అలెక్సియా పుటెల్లాస్, ఐతనా బొన్మటి స్థానం సంపాదించారు.
