గండిపేట,వెలుగు : రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లోని వాటర్ప్యూరిఫైర్పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో సామగ్రి, ఎలక్ట్రానిక్వస్తువులు, బట్టలు, ఇతర విలువైన వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. శివసాయినగర్ ఫేజ్-2లోని ఇండిపెండెంట్హౌస్లో శ్రీకాంత్, కీర్తి దంపతులు ఏడేండ్ల నుంచి ఉంటున్నారు. మంగళవారం ఉదయం శ్రీకాంత్ఆఫీసుకు వెళ్లగా..కీర్తి తన కూతురును స్కూల్లో దింపేందుకు వెళ్లింది.
ఆ టైంలో ఇంటి నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన పక్కింటి వారు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వారు వచ్చేలోపే మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమైంది. ఇంట్లో ఫ్రిజ్ వద్ద షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్లే మంటలు వ్యాపించి వాటర్ప్యూరిఫైర్ తర్వాత రిఫ్రిజిరేటర్పేలిపోయాయని, దీంతో తక్కువ టైంలోనే ఇల్లు మొత్తం కాలిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ ప్రమాదంతో తమకు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
