లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదు?..పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఫైర్ 

లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదు?..పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేసిన ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే.. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎందుకు వెళ్లలేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్యపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు డబుల్ బెడ్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గజ్జెల కాంతం తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, సీఎం రేవంత్ రెడ్డి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.