కొత్త తరహా వినోదంతో లిటిల్ హార్ట్స్ మౌళి

కొత్త తరహా వినోదంతో  లిటిల్ హార్ట్స్ మౌళి

90స్ వెబ్ సిరీస్, లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న  మౌళి తనూజ్ లీడ్‌‌‌‌గా నటించిన మరో చిత్రం ‘డీఎన్‌‌‌‌కే’. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. నవంబర్ 13న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మౌళి తనూజ్ మాట్లాడుతూ ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సబ్జెక్ట్.  సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇందులో క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ అది కూడా చాలా ఫన్‌‌‌‌గా ఉంటుంది. 

ఈజీ మనీకి అలవాటుపడిన ఓ యువకుడు గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అప్పుల్లో కూరుకుపోయి, వాటి నుంచి బయటపడేందుకు దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎదురయ్యే పరిణామాలే ఈ  కథ. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నా పాత్ర బబ్లూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఈ సినిమాను ‘దొంగ నా కొడకా’ అనే టైటిల్‌‌‌‌తో ప్రచారం చేశాం.  సెన్సార్ అభ్యంతరాలు రావడంతో ‘డీఎన్‌‌‌‌కే’గా మార్చాం.   

ఆలీ గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సింజిత్ అందించిన పాటలు, బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటాయి.   ఈ సినిమా ద్వారా ప్రొడక్షన్ గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నా.  మైత్రీ అనిల్ గారి సహకారంతో మంచి టీమ్‌‌‌‌వర్క్‌‌‌‌తో సినిమా పూర్తి చేశాం.  రవితేజ గారు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఉంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి కొత్త తరహా కథలు, మంచి ఎంటర్‌‌‌‌టైనింగ్ సినిమాలతో కెరీర్‌‌‌‌‌‌‌‌లో ముందుకెళ్లాలనుకుంటున్నా’’ అని చెప్పాడు.