నాగార్జున సమర్పణలో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వంలో, వెంకీ కుడుముల నిర్మించిన సినిమాకు తమన్ సంగీతం అందించాడు. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ ‘అనీష్ తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడం అభినందనీయం.
మూగవాడిగా నటించినప్పటికీ నవరసాలను పలికించాడు. నేను కూడా ‘రంగస్థలం’లో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. నాగార్జున మాట్లాడుతూ ‘సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యా. అనీష్ తన పాత్రలో లీనమైపోయాడు. తన కళ్లతో మాట్లాడాడు. అనీష్ ప్రేమ అందరికీ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు దిల్ రాజు, వై.రవి శంకర్, అఖిల్ అక్కినేని ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరారు. ఇది తన తొలి అడుగు మాత్రమేనని, ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా దూరం వెళ్లాలని అనీష్ అన్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని అనస్వర రాజన్ చెప్పింది. దర్శకుడు మహేష్, నిర్మాత వెంకీ కుడుముల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని అన్నారు.
