అగ్రికల్చర్ చదివిన వారికి గుడ్ న్యూస్.. IIMRలో ఉద్యోగాలు

అగ్రికల్చర్ చదివిన వారికి గుడ్ న్యూస్.. IIMRలో ఉద్యోగాలు

దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) పలు ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 13.

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్)/ యంగ్ ప్రొఫెషనల్-–II 8, యంగ్ ప్రొఫెషనల్-–I 5.

విద్యార్హతలు
సీనియర్ రీసెర్చ్ ఫెలో/ యంగ్ ప్రొఫెషనల్-II

ప్లాంట్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చరల్ ఎక్స్​టెన్షన్, అగ్రికల్చరల్ సైన్సెస్, అగ్రిబిజినెస్ 
మేనేజ్‌మెంట్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్సీ/ ఎంబీఏ/ పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి.   4 లేదా 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు రెండేళ్ల 
మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండటం తప్పనిసరి.

యంగ్ ప్రొఫెషనల్-I:  అగ్రికల్చర్ లేదా సంబంధిత లైఫ్ సైన్సెస్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బ్రీడింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీజీ  డిగ్రీ కలిగి ఉండాలి.
వయసు: ఎస్ఆర్ఎఫ్ పోస్టులకు35 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

యంగ్ ప్రొఫెషనల్ -I & II  పోస్టులకు 21 నుంచి 45 సంవత్సరాలు మించకూడదు.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 18.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ millets.res.inను సందర్శించండి.