చిన్నారుల కలలకు ఆర్థిక భరోసా.. ముందస్తు ప్లాన్స్తో సాధ్యం

చిన్నారుల కలలకు ఆర్థిక భరోసా.. ముందస్తు ప్లాన్స్తో సాధ్యం
  • చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకాలు తీసుకోవాలి  
  • ఎస్​బీఐ లైఫ్​ జోనల్​ డైరెక్టర్​ దినేష్​

హైదరాబాద్​, వెలుగు: పిల్లల ఉన్నత విద్య, కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యాలు, ఇతర ఆకాంక్షలను నెరవేర్చాలంటే తల్లిదండ్రులు ముందుగానే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్షిణ ప్రాంత జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దినేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఎంత మొత్తం పొదుపు చేస్తున్నామన్నదానికంటే, ఎంత ముందుగా పొదుపు ప్రారంభించామన్నదే దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో కీలకమని పేర్కొన్నారు. ‘‘పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం చివరి నిమిషంలో భారీ మొత్తాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయకుండా, చిన్న మొత్తాలతో క్రమం తప్పకుండా పొదుపు చేయడం మంచిది. 

వాళ్ల ఆసక్తులు, కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యాలు మారే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళికల్లో తగిన వెసులుబాటు ఉండాలి. పొదుపుతో పాటు ఆర్థిక భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ ఆదాయానికి ఆటంకం కలిగినా పిల్లల లక్ష్యాలు దెబ్బతినకుండా చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకాలు తోడ్పడతాయి. పథకాన్ని బట్టి గ్యారంటీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెచ్యూరిటీ ప్రయోజనాలు, ఏకమొత్తం లేదా విడతలవారీ చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు మరణిస్తే భవిష్యత్తు ప్రీమియాల మాఫీ ప్రయోజనం కొన్ని పథకాల్లో ఉంటుంది.  

ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంచుకునేటప్పుడు పిల్లల భవిష్యత్తు లక్ష్యాలు, చెల్లింపుల విధానం, భద్రతా ప్రయోజనాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిశీలించాలి. ముందస్తు ప్రణాళికతో పిల్లలు తమకు నచ్చిన విద్య, కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశాలను ఎలాంటి ఆర్థిక రాజీ లేకుండా ఎంచుకోగలుగుతారు”అని దినేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

మరిన్ని వార్తలు