ప్రైవేటు ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.3000..నవంబర్ 19న ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ కీలక సమావేశం

ప్రైవేటు ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.3000..నవంబర్ 19న ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ కీలక సమావేశం

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ నెల 19న ఈపీఎఫ్​ఓ ట్రస్టీల సమావేశం జరగనుంది. అయితే పెంపుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. రెండు శాఖలు కూడా రూ.3,000 పెన్షన్ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.  ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీసం రూ.1,000 పెన్షన్ 2014 సెప్టెంబర్ నుంచి అమలవుతోంది. ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ మొత్తం సరిపోవడం లేదని పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా వాదిస్తున్నాయి. కనీస పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.7,500కు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.