హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బిజినెస్‌లు, స్టార్టప్‌లకు మరింత ఊతమిచ్చే లక్ష్యంతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని ‘ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హైదరాబాద్’ (టీఐఈ) ప్రకటించింది. ఈనెల 20న హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్. ఈ సదస్సుకు 2,000 మందికి పైగా వ్యాపారవేత్తలు, 120 మందికి పైగా పెట్టుబడిదారులు, 80 మందికి పైగా వక్తలు హాజరవుతారు. ఏఐ, రక్షణ, అంతరిక్ష సాంకేతికత, పెట్టుబడులు, క్విక్ కామర్స్, ఎస్ఎంఈ ఐపీఓలు వంటి రంగాలపై చర్చలు జరగనున్నాయి. మాస్టర్‌క్లాసులు, స్టార్టప్ ప్రదర్శనలు కూడా ఉంటాయి. తెలంగాణలోని 50 ప్రతిభావంతమైన స్టార్టప్‌లను గుర్తించేందుకు టీఐఈ50 తెలంగాణ 2026 కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ఎంపికైన సంస్థలకు 12 నెలల పాటు మార్గదర్శకత్వం, అంతర్జాతీయ నెట్వర్క్ అనుసంధానం, రూ.5 లక్షలకు పైగా విలువైన భాగస్వామ్య ప్రయోజనాలు అందించనున్నారు. గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు టీఐఈ ఉమెన్ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంస్థ తెలిపింది.
