దీపావళి పండుగ ముగిసిన తర్వాతి నుంచి బంగారం రేట్లు అనూహ్యంగా తగ్గుతూ నేలచూపులు చూస్తున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లు కూడా పడిపోవటం షాపర్లకు మంచి అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా రేట్లు తగ్గినప్పుడల్లా కొంటూ ఉండే తెలుగు ఫ్యామిలీలకు ఇదొక సదవకాశం. అయితే మీరు షాపింగ్ చేయటానికి నిర్ణయం తీసుకునే ముందు సమీప నగరంలోని తగ్గిన రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది.
నవంబర్ 11న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 71 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 198గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 015గా కొనసాగుతోంది.
ALSO READ : ప్రైవేటు ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.3000..
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 11, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రేటు రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.200 దగ్గర ఉంది. భవిష్యత్తులో రేట్లు ఇంకా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
