న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబర్ క్వార్టర్లో నిరుద్యోగ రేటు 5.1 శాతానికి చేరింది. అంతకుముందు క్వార్టర్లో ఇది 5.4 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతానికి తగ్గడమే ఇందుకు కారణం. ఉద్యోగుల సంఖ్యతో పాటు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నవారి సంఖ్యా పెరిగింది. మహిళల ఉద్యోగ భాగస్వామ్యంలోనూ మెరుగుదల కనిపించింది. గత క్వార్టర్లో 33.2 శాతంగా ఉన్న మహిళల ఉపాధి భాగస్వామ్య రేటు తాజా క్వార్టర్లో 34.7 శాతానికి పెరిగిందని వెల్లడయింది.
