సోనియాగాంధీ ఆత్మకథ: సిక్కు వ్యతిరేక అల్లర్లు సిగ్గుచేటు

సోనియాగాంధీ ఆత్మకథ: సిక్కు వ్యతిరేక అల్లర్లు సిగ్గుచేటు

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు భారత దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన, సిగ్గుచేటు ఘటన అని సోనియా గాంధీ తన ఆత్మకథలో రాశారు. తన భర్త, నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హృదయంలో ఎలాంటి ద్వేషం కానీ, మతతత్వం కానీ లేవని స్పష్టం చేశారు. కల్లోల సమయంలో రాజీవ్ గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు దారుణంగా మారాయని గుర్తుచేసుకున్నారు. 

ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో నిస్సహాయులైన సిక్కులపై అకృత్యాలు జరిగాయని, కేవలం రాజధాని ఢిల్లీలోనే 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ వెంటనే స్పందించి మీడియా ద్వారా శాంతిని కోరారని, ప్రజలు ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారని తెలిపారు. బాధితులకు న్యాయం అందించడంలో మన దేశ న్యాయ వ్యవస్థ విఫలమైందని, సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి ఇప్పటికీ కోర్టుల్లో కేసులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.