వార్డ్ రోబ్ నీట్ గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

వార్డ్ రోబ్ నీట్ గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

వార్డ్ రోబ్ లోని డ్రెస్ లను నీట్ గా ఒక ఆర్డర్ వా లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాదు తక్కువ డ్రెస్ లు మాత్రమే ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే వార్డ్ రోబ్ నిండా డ్రెస్ ఉంటే వాటిల్లో ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాదు. దాంతో టైమ్ వేస్ట్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి....

  • వార్డ్ రోబ్ తెరిచి అందులో అనవసరంగా ఉన్న డ్రెస్లని తీసెయ్యాలి. ఈ మధ్య ఆ డైస్ వేసుకున్నారా? కంఫర్ట్ గా ఉందా? లేదా? ఏ డ్రెస్. లు రెగ్యులర్ గా వేసుకుంటున్నారు? అనేవి గమనించాలి. అంతేకాదు చాన్నాళ్లుగా వేసుకోని డ్రెస్లు వార్డ్రోబ్లో ఉంటే వాటిని తీసెయ్యాలి.
  • డ్రెస్ లకు మ్యాచ్ అయ్యే యాక్సెసరీలని వార్డ్ రోబ్ లో పెట్టాలి. దాంతో పార్టీ, ఫంక్షన్ కి రెడీ అయ్యేముందు హడావిడి పడాల్సిన అవసరం ఉండదు.
  • సీజన్ మారినప్పుడు వార్డ్ రోబ్ లో  డ్రెస్ లను మార్చాలి. ఆయా సీజన్లో ఎక్కువగా వేసుకునే డ్రెస్లు, ఇతర వస్తువులు ఉండేలా చూసుకోవాలి. పండుగలు, స్పెషల్ అకేషన్స్ కు ముందు రోజే వార్డ్ రోబ్ సర్దుకుంటే ఎప్పుడూ ఒకే రకం అవుట్ ఫిట్ వేసుకోకుండా జాగ్రత్తపడొచ్చు.