వాషింగ్టన్: ఇరాన్‌పై సైనిక చర్యలు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపించాయి. కొన్ని దశాబ్ధాలుగా పార్టీకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా రిపబ్లికన్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమితో ఇరాన్‌పై సైనిక చర్యలు విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు కొత్త వ్యుహాం రచించారు.
ఇకపై ఇరాన్‌పై సైనిక దాడులు చేయకుండా.. అలాగే, ఆ దేశంతో శాంతి ఒప్పందం కూడా కుదుర్చుకోవద్దని ట్రంప్ నిర్ణయానికి వచ్చినట్లు ఆక్సియోస్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక యుద్ధానికి సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అమెరికా తన విదేశాంగ విధానంలో భాగంగా ఇరాన్‌పై కఠిన వైఖరిని అవలంబించనుందని తెలిపారు.
►ALSO READ | ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం! లక్షణాలు ఎలా ఉంటాయి ? వ్యాక్సిన్లు పనిచేస్తాయా ?
ఇకపై సైనిక దాడులకు బదులు ఆర్థిక ఆంక్షలకే అమెరికా ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా నేవల్ బ్లాకేడ్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. శాంతి ఒప్పందాల జోలికి వెళ్లకుండా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇరాన్‌పై దాడులు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక ఆంక్షలపై ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలీ.
