హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన నల్గొండకు చెందిన కోయ శ్రీజారెడ్డి అదృశ్యమయ్యారు. ఆమె ఆచూకీ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా బోస్టన్లోని ‘తానా’ ప్రతినిధి కృష్ణప్రసాద్‌తో మంగళవారం మంత్రి ఫోన్లో మాట్లాడారు.
శ్రీజా ఆచూకీ కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే బోస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్, కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి ఈ-మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆదేశాలతో అధికారులు ప్రతిరోజూ శ్రీజా కుటుంబ సభ్యులకు అప్డేట్స్ ఇస్తున్నారు.
