గుడ్ న్యూస్: నవంబర్ 12 నుంచి కొత్త పింఛన్లు

 గుడ్ న్యూస్:  నవంబర్ 12 నుంచి కొత్త పింఛన్లు
  • మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో పంపిణీకి ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: కొత్తగా మంజూరు చేసిన చేనేత పింఛన్లను ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు పంపిణీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తుదారుల పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆమోద ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.

ఈ మేరకు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లకు సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు నియోజకవర్గాలవారీగా మండలకేంద్రాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు