ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్

ఏసీబీకి చిక్కిన  భైంసా మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ ఇన్​చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ లంచం తీసుకుంటూ ఏసీబీ ఆధికారులకు పటుబడ్డాడు. భైంసా మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ తో పాటు ఇన్​చార్జి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఒక కాంట్రక్టర్ కు రూ.2.60 లక్షల బిల్లు చెల్లించే విషయంలో రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.

 దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆఫీసర్ల సూచన మేరకు మంగళవారం సాయంత్రం సదరు కాంట్రాక్టర్ నిర్మల్ లోని కుబేర హోటల్ సమీపంలో రూ.50 వేలను ఇన్​చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ కు లంచంగా ఇస్తుండగా రెడ్​ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.