మంచిర్యాల, వెలుగు: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత సస్పెన్షన్వేటు వేశారు. తిర్యాణి మండలంలోని పీఎంశ్రీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎంసంబరం శ్రీనివాస్ మద్యం తాగి స్కూల్ కు వచ్చినట్లు గుర్తించడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
ఉపాధ్యాయ వృత్తికి తగిన ప్రవర్తన, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్స్పష్టం చేశారు. అలాగే బెజ్జుర్ మండలం సలుగుపల్లి జడ్పీహెచ్ఎస్హెచ్ఎం రవి విధులకు సంబంధించిన సమావేశం ప్రారంభానికి ముందే వెళ్లిపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు.
ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. విద్యాశాఖ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
