ప్రపంచ మార్కెట్లోకి ములకనూరు బియ్యం..

ప్రపంచ మార్కెట్లోకి ములకనూరు బియ్యం..


భీమదేవరపల్లి(హనుమకొండ ), వెలుగు : ములకనూరు బియ్యం, విత్తనాలకు అంతర్జాతీయ మార్కెట్​లో స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు సొసైటీ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్​రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ, దక్షిణ కొరియా మధ్య వాణిజ్య సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 

అందులో భాగంగా దక్షిణ కొరియాలోని ప్రముఖ ఆహార పరిశ్రమల సముదాయం ఫుడ్‌‌‌‌పోలిస్, అంతర్జాతీయ ఆహార ప్రదర్శన కేంద్రాలను ఆయన సందర్శించారు. కొరియాలోని భారత వాణిజ్య మండలి అధ్యక్షుడు రమేశ్​అయ్యర్, సియోల్‌‌‌‌లోని భారత రాయబార కార్యాలయ అధికారి మినిదేవి కుమంను కలిసి భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న వాణిజ్య అవకాశాలపై చర్చించారు.

 ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్‌‌‌‌లోకి తీసుకురావాలన్నారు.