JCBని ఎత్తి పడేసిన ఎద్దు.. వణికిపోతూ చూసిన జనం !

JCBని ఎత్తి పడేసిన ఎద్దు.. వణికిపోతూ చూసిన జనం !

బాహుబలి సినిమాలో దున్నతో రాణా తలపడే సన్నివేశం గుర్తుండే ఉంటుంది. అలాంటి బాహుబలి ఎద్దు రోడ్డుపైకి వచ్చి ఏకంగా భారీ JCBని ఎత్తి పడేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అయితే ఎద్దు JCBని ఎత్తేస్తున్న ఘటన నిజంగా జరిగిందా లేక AIతో రియలిస్టిక్గా క్రియేట్ చేసిన వీడియోనా అనే ప్రశ్న తలెత్తుతోంది. వీడియోలో ఏముందంటే.. రోడ్డు పక్కన చిన్న చిన్న షాపులున్న ఒక సందులో పసుపు రంగు JCB నిలబడి ఉంది. అదే సమయంలో ఒక పెద్ద ఎద్దు ఆ JCB వైపు నడిచి వస్తుంది.

తలను JCB బకెట్ కింద పెట్టి బలంగా ముందుకు నెట్టింది. దీంతో.. JCB ముందు భాగం యాక్సిల్తో సహా పైకి లేచినట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యం చూసి స్థానికులు విస్తుపోయారు. చుట్టుపక్కల నిలబడిన జనం ఆశ్చర్యంగా చూస్తుండటం, హిందీలో అరుపులు వినిపించడం కూడా వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వీడియోను గమనిస్తే క్లియర్ గా AI వీడియో అని అర్థమవుతూనే ఉంది. వీడియోలో కనిపిస్తున్న జనం హావభావాలన్నీ ఒకే తీరుగా ఉండటంతో ఈ వీడియో AIతో చేసిందేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

ఈ వీడియో Facebook, Instagramతో పాటు X (Twitter)లో.. స్థానిక డిజిటల్ న్యూస్ చానళ్లు, మీమ్ పేజీల్లో వైరల్ అయింది. ఎద్దుకు 'బాహుబలి' అనే పేరు పెట్టి, 'JCB హీ ఉఠా దీ', 'Nature's strength vs Heavy machinery' వంటి క్యాప్షన్లతో పోస్ట్ లు చేశారు. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే వివరాలు లేవు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారు, ఏ తేదీన ఈ ఘటన జరిగింది అనే విషయాలేవీ ధృవీకరించలేదు.

►ALSO READ | జమ్మూ కాశ్మీర్‏లో CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు..!

సాధారణ JCB బాక్‌హో లోడర్ బరువు 7 టన్నులకు పైగా ఉంటుంది. ఒక ఎద్దు దాన్ని ఎత్తగలదా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. Xలో కొందరు యూజర్లు ఆ వీడియోను '#AI' హ్యాష్‌ట్యాగ్తో రీపోస్ట్ చేశారు. మొత్తంగా చూస్తే.. అది క్లియర్గా ఏఐతో చేసిన వీడియోనని అర్థమవుతూనే ఉంది.