Hardik Pandya's First Reaction: ముంబై ఇండియన్స్‌ను వీడి పంజాబ్ కింగ్స్‌లోకి అడుగుపెట్టిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. కొత్త జర్నీపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌లకు సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈరోజు (2026, నవంబర్ 11, బుధవారం) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మెగా స్వాప్ డీల్ ద్వారా హార్దిక్ పాండ్యా పంజాబ్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ ట్రేడ్ పూర్తైనా వెంటనే హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంజాబ్ ఫ్యాన్స్‌కు, మేనేజ్‌మెంట్‌కు అదిరిపోయే స్వాగతం పలికాడు.
హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్:
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో హార్దిక్ పాండ్యా ఓ పోస్ట్ రాసుకొచ్చాడు.. అందులో నా కెప్టెన్ శ్రేయస్.. నా కోచ్ రికీ.. నా జట్టు మొత్తం పంజాబ్ ప్రజలే.. మీ అందరికీ నేను అండగా నిలబడతానని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ద్వారా హార్దిక్ తాను పంజాబ్‌లో ఎలాంటి ఈగోలకు పోకుండా, ఇప్పటికే ఉన్న శ్రేయస్ అయ్యర్ నాయకత్వాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోచింగ్‌లో పంజాబ్ జట్టును తొలి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలపడమే లక్ష్యంగా హార్దిక్ సిద్ధమవుతున్నాడు.
►ALSO READ | ముంబైలోకి అర్ష్‌దీప్ సింగ్.. ప్రపంచాన్ని ఏలేద్దామంటూ ఫస్ట్ మెసేజ్.. ఫ్యాన్స్‌లో జోష్!
బ్లాక్‌బస్టర్ ట్రేడ్ డీల్:
* హార్దిక్ పాండ్యా (PBKS కి): తన పాత ఫీజు రూ. 16.35 కోట్ల నుంచి పెరిగి, రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్‌లోకి మారాడు.
* ఆర్ష్‌దీప్ సింగ్ (MI కి): పంజాబ్‌లో 8 ఏళ్లు ఆడి 111 వికెట్లు తీసిన స్టార్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్.. రూ. 18 కోట్ల ధరకు ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి ముంబై పేస్ దళాన్ని మరింత బలోపేతం చేయనున్నాడు. మొత్తానికి, ముంబైలో తన రెండో ఇన్నింగ్స్‌కు గుడ్‌బై చెప్పిన హార్దిక్.. పంజాబ్ కింగ్స్ రథసారథులు శ్రేయస్, పాంటింగ్ తో కలిసి ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.
Sat Sri Akaal, ਪੰਜਾਬ♥️ https://t.co/7wt1j4Sd6Q
— Punjab Kings (@PunjabKingsIPL) November 11, 2026
