19 ఏళ్లుగా అందని IPL కప్పు.. హార్దిక్ పాండ్యా రాకతో పంజాబ్ కింగ్స్ కల నెరవేరేనా?

19 ఏళ్లుగా అందని IPL కప్పు.. హార్దిక్ పాండ్యా రాకతో పంజాబ్ కింగ్స్ కల నెరవేరేనా?

Hardik Pandya: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన హార్దిక్ పాండ్యా ఇప్పుడు పంజాబ్ కింగ్స్ (PBKS) అదృష్టాన్ని మార్చేందుకు సిద్ధమయ్యాడు. రూ. 18 కోట్ల చారిత్రాత్మక స్వాప్ డీల్ ద్వారా పంజాబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని పంజాబ్ నిరీక్షణకు తెరదించగలడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అయితే, 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఒకే ఒక్కసారి (2014) ఫైనల్స్ చేరిన ఆ జట్టు, ప్రతి ఏడాది సరైన లీడర్‌షిప్ లేక తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ క్రమంలో ట్రోఫీలు ఎలా గెలవాలో తెలిసిన విన్నింగ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాక పంజాబ్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

హార్దిక్ పాండ్యా: ఐపీఎల్ గోల్డెన్ హ్యాండ్ ట్రాక్ రికార్డ్: 


ట్రేడ్ డీల్ వివరాలు (Deal Breakdown):

* హార్దిక్ పాండ్యా (PBKS ): తన పాత ఫీజు రూ. 16.35 కోట్ల నుంచి, రూ. 18 కోట్ల భారీ ధరతో పంజాబ్ కింగ్స్‌లోకి చేరాడు.

* ఆర్ష్‌దీప్ సింగ్ (MI ): మెగా వేలంలో లభించిన తన ప్రస్తుత ఫీజు రూ. 18 కోట్లతోనే ముంబై ఇండియన్స్‌లోకి ఆర్ష్‌దీప్ మారాడు.

హార్దిక్‌ను ముంబై ఎందుకు వదిలి పెట్టిందంటే: 

* ఫిట్‌నెస్ సమస్యలు: గత ఐదు నెలల వ్యవధిలోనే బ్యాక్ స్పాజమ్స్, లెగ్ స్ట్రెయిన్, షిన్ ఇంజ్యూరీ (కాలి గాయం)లతో బాధపడ్డ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2026లో కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

* పేలవమైన కెప్టెన్సీ రికార్డు: రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. 2024లో ముంబైని పాయింట్ల పట్టికలో అట్టడుగు (10వ స్థానం)న నిలబెట్టాడు. 2025లో క్వాలిఫైయర్ 2 చేరినా, 2026లో మళ్లీ 9వ స్థానంతో తీవ్రంగా నిరాశపరిచాడు. అభిమానుల నుంచి విపరీతమైన నెగెటివిటీని కూడా ఎదుర్కొన్నాడు. 

ఆర్ష్‌దీప్‌తో ముంబై పేస్ విభాగానికి బలం:

గత సీజన్‌లో బలహీనంగా కనిపిచిన ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ఆర్ష్‌దీప్ సింగ్ రాకతో అత్యంత శక్తివంతంగా మారనుంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఇప్పటి వరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆర్ష్‌దీప్ 111 వికెట్లు తీసి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందాడు. తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ రాక ఆల్‌రౌండర్ సమస్య తప్పినట్లైంది.