SRH IPL 2027 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) గత సీజన్ లో నిలకడైన ప్రదర్శనతో ఎలిమినేటర్ వరకు వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. నవంబర్ 17న రిటెన్షన్ డెడ్‌లైన్ ముగియడానికి ముందే రాబోయే ఐపీఎల్ 2027 కోసం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. ట్రేడింగ్ విండో ద్వారా 3 కీలక డీల్స్‌ను పూర్తి చేసి తమ ప్రధాన సమస్య అయిన బౌలింగ్‌ను బలోపేతం చేసుకుంది. కానీ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే సీజన్ నాటికి అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొంది, అలాగే మరో పేసర్ హర్షల్ పటేల్ ఫామ్ లో లేకపోవడం కలవరపెడుతుంది ఈ క్రమంలో జట్టులో ఎవర్ని రిటైన్ చేసుకోవాలి, ఏ ప్లేయర్ ని వదిలి పెట్టాలనే టెన్షన్ లో SRH జట్టు యజమాన్యం ఉంది.
సన్‌రైజర్స్ చేసిన 3 ప్రధాన ట్రేడ్ డీల్స్:
* టి. నటరాజన్ (DC ➡️ SRH): తమ మాజీ యార్కర్ కింగ్ నటరాజన్‌ను రూ. 5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తిరిగి దక్కించుకుంది. (బదులుగా జీషాన్ అన్సారీ DC కి వెళ్లాడు).
* ఖలీల్ అహ్మద్ (CSK ➡️ SRH): చెన్నై సూపర్ కింగ్స్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్‌ను రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది.
* నాథన్ ఎల్లిస్ (CSK ➡️ SRH): ఆస్ట్రేలియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఎల్లిస్‌ను ₹2 కోట్లకు దక్కించుకుంది. (ఈ డీల్‌లో భాగంగా లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను SRH సీఎస్కేకి ఇచ్చేసింది).
బౌలింగ్‌నే ఎందుకు టార్గెట్ చేశారు?:
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన SRH, 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచింది. అయితే బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ బౌలింగ్ బాగా దెబ్బకొట్టింది. అందు కోసమే ఈసారి ఆ లోటు పూర్తి చేసుకోవడానికే SRH సిద్ధమైంది.
* బ్యాటింగ్ రన్ రేట్: 10.54 (లీగ్‌లోనే సెకండ్ బెస్ట్).
* పవర్ ప్లే స్కోరింగ్ రేట్: 11.08 (లీగ్‌లోనే సెకండ్ బెస్ట్).
* బౌలింగ్ ఎకానమీ రేట్: 10.05 (లీగ్‌లోనే అత్యంత దారుణమైన 3వ బౌలింగ్ రికార్డు).
* ఈ బౌలింగ్ లోపాన్ని సరిదిద్దడానికే SRH ఫ్రాంచైజీ కొత్త ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించింది.
SRH ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్లు:
తమ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విధ్వంసకరంగా ఉండటంతో బ్యాటింగ్ కోర్‌ను SRH అలానే ఉంచుకోనుంది.
* హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen): రూ. 23 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ, 2026 సీజన్లో 160 స్ట్రైక్ రేట్‌తో 624 పరుగులు సాధించి తన విలువను నిరూపించుకున్నాడు.
* ఇషాన్ కిషన్ (Ishan Kishan): 182.42 స్ట్రైక్ రేట్‌తో 602 పరుగులు చేశాడు. భవిష్యత్తు కెప్టెన్‌గాSRH అతన్ని చూస్తోంది.
* అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్: ఐపీఎల్‌లోనే అత్యంత విధ్వంసకర పవర్‌ప్లే ఓపెనింగ్ జోడీని SRH ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే అవకాశం లేదు.
రిలీజ్ అయ్యే భారత ఆటగాళ్లు (Indian Players):
వాషింగ్టన్ సుందర్ (రూ. 8.75 కోట్లు): జట్టులో తీవ్ర పోటీ ఉండటం, తరచూ గాయాల బారిన పడటంతో పాటు తుది జట్టులో అవకాశాలు రాకపోవడంతో సుందర్‌ను వదిలేసి ఆ పర్స్ అమౌంట్‌ను క్లియర్ చేసుకోవాలని SRH చూస్తోంది.
ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు): ఎక్స్‌ప్రెస్ వేగంతో బౌలింగ్ వేసే సత్తా ఉన్నప్పటికీ, లైన్ అండ్ లెంగ్త్ నిలకడలేకపోవడం, పరుగులు భారీగా ఇస్తుండటంతో నటరాజన్, ఖలీల్ రాక తర్వాత ఉమ్రాన్‌ను వేలంలోకి వదిలేసే ఆలోచనలో హైదరాబాద్ ఉంది.
ఉపేంద్ర యాదవ్ / సమర్థ్ వ్యాస్: నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు రాకపోవడం, స్క్వాడ్ ప్రక్షాళనలో భాగంగా వీరికి ఉద్వాసన తప్పకపోవచ్చు.
రిలీజ్ కానున్న విదేశీ ఆటగాళ్లు (Overseas Players):
* మార్కో యాన్సెన్ (రూ. 7.5 కోట్లు): సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డెత్ ఓవర్లలో నిరాశపరచడం, కొత్తగా నాథన్ ఎల్లిస్ రాకతో యాన్సెన్‌ను తుది జట్టులో ఉంచుకోవడం కష్టమే.
* ఫజల్హక్ ఫారూకీ (రూ. 50 లక్షలు): ఖలీల్ అహ్మద్ రూపంలో క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ ఇండియన్ పేసర్ దొరకడంతో ఫారూకీ సేవలు ఇక SRHకి అవసరం లేకపోవచ్చు.
SRH వ్యూహం (Auction Strategy):
హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ప్రైమ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటూనే.. ఇతర ఆటగాళ్లను వదిలేయడం ద్వారా సన్‌రైజర్స్‌కి రూ. 25 నుంచి 30 కోట్ల పైచిలుకు పర్స్ అమౌంట్ సమకూరుతుంది. ఈ డబ్బుతో డిసెంబర్ 16 వేలంలో బౌలింగ్ విభాగంలో కొత్త రక్తాన్ని నింపి, బ్యాటింగ్ దండయాత్రను కొనసాగిస్తూ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడమే లక్ష్యంగా ఆరెంజ్ ఆర్మీ సిద్ధమవుతోంది.
