సిర్పూర్ (యు): ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన రెండవ మనుమడు, సోనేరావ్ వాలా తమ్ముడు భీంరావ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూమృతి చెందారు.
శనివారం జైనూర్‌లో ఆటో, బొలేరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో భీంరావ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఆయనను వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ నిన్న( మంగళవారం) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
భీంరావ్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణవార్తతో ఆదివాసీ సమాజంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. భీంరావ్ అంత్యక్రియలను సిర్పూర్ (యు) మండలంలోని పెద్దదోబా గ్రామంలో నిర్వహించనున్నారు.
