ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య పంజాబ్ కు వెళ్లనున్నాడు అని వస్తున్న వార్తలపై ముంబై స్పందించింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ట్రేడ్ పూర్తయిందని.. హార్దిక్ పంజాబ్ కు వెళ్లినట్లు ముంబై ఫ్రాంఛైజీ ప్రకటించింది. 2026 నవంబర్ 11న ముంబై ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఐపీఎల్ ఆక్షన్ కు ముందే ముంబై, పంజాబ్ మధ్య డీల్ కుదిరింది. ప్లేయర్స్ ఎక్స్చేంజ్ ఒప్పందంలో హార్దిక్ ను పంజాబ్ తీసుకోగా.. బదులుగా ముంబైకి పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను ఇచ్చింది. దీంతో 2027 ఐపీఎల్ లో హార్ధిక్ పంజాబ్ తరఫున ఆడనున్నాడు.ట్రేడ్ పూర్తయినట్లు ముంబై ప్రకటించింది. బీసీసీఐ కూడా ఆమోదించడంతో ఇక ముంబై కెప్టెన్ పంజాబ్ కోసం ఆడనున్నాడు. అయితే పంజాబ్ లో ఆయన పాత్ర ఏంటనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం.
హర్దిక్ కు రూ.18 కోట్లు..
ప్రస్తుత ట్రేడ్ ప్రకారం హార్దిక్ పాండ్యాకు పంజాబ్ 18 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకుంది. ఇది ముంబై ఇండియన్స్ లో ఉన్న వేతనంతో పాల్చితే ఎక్కువే. ముంబై ఇండియన్స్ లో హార్దిక్ 16 కోట్ల 50 లక్షలు తీసుకునేవాడు. కోటిన్నర రూపాయలు అదనంగా వెచ్చించి పంజాబ్ హార్దిక్ ను తీసుకుంది. అదే సమయంలో అర్ష్ దీప్ పంజాబ్ ఎంత ఇచ్చిందో ముంబై కూడా అంతే ఇస్తోంది. అర్ష్ దీప్ 18 కోట్లు చెల్లించనుంది ముంబై.
ముంబైలో హార్దిక్ గణాంకాలు..
ముంబై ఇండియన్స్ (MI)తో హార్దిక్ పాండ్యా సెకండ్ ఇన్నింగ్స్ జర్నీలో మూడు సీజన్ల పాటు కొనసాగినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ మూడు సీజన్లలో 39 మ్యాచ్‌లు ఆడి, 35 ఇన్నింగ్స్‌ల్లో 21.53 సగటు, 147.82 స్ట్రైక్ రేట్‌తో 647 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 48 నాటౌట్. బౌలింగ్‌లో 39 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. 34కు పైగా సగటుతో వికెట్లు తీసిన అతను, ఒకసారి ఐదు వికెట్లు సాధించాడు.
హార్దిక్ కెప్టెన్సీలో 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే 2024, 2026 సీజన్లలో మాత్రం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
అర్ష్ దీప్ సింగ్ రికార్డులు:
మరోవైపు, అర్ష్‌దీప్ సింగ్ ఎనిమిది సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించిన పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టును వీడి ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడు. 2019లో పంజాబ్ జట్టు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్, క్రమంగా లీగ్‌లో అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
