భారత్‌లో క్వాల్‌కామ్ లేఆఫ్స్: వెంటనే సంతకం చేస్తే ఒక నెల శాలరీ అదనంగా ఆఫర్

భారత్‌లో క్వాల్‌కామ్ లేఆఫ్స్: వెంటనే సంతకం చేస్తే ఒక నెల శాలరీ అదనంగా ఆఫర్

అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా భారత్‌లో ఉద్యోగాల తొలగింపులను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ లేఆఫ్స్ ప్రక్రియ.. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, రీసెర్చ్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్‌ఫోన్ చిప్ వ్యాపారంలో ఎదురవుతున్న ఒత్తిళ్లు, రాబడుల క్షీణత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం భారతీయ ఉద్యోగులపై ఎలా ప్రభావం చూపుతుందో వివరంగా చూద్దాం రండి...

ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించిన క్వాల్‌కామ్.. అందులో భాగంగానే భారత్‌లోనూ లేఆఫ్ చేస్తోంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నైలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్లు, అనుభవజ్ఞులైన ఉద్యోగులపై దీని ప్రభావం పడుతోంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టియానో అమోన్ అక్టోబర్‌లో పంపిన అంతర్గత మెమోలో ఉద్యోగుల పనితీరు ఆధారంగానే లేఆఫ్స్ చేస్తున్నట్లు చెప్పారు. 

భారత్‌లో సుమారు 1,000 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితం కావచ్చని విశ్లేషకుల అంచనా. అయితే రియాలిటీలో ఈ సంఖ్య తక్కువగా ఉండవచ్చని ఇతర నివేదికలు పేర్కొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అమ్మకాలు మందగించడం, రాబడులు తగ్గడం, ఏఐ, డేటా సెంటర్ల రంగాలపై కంపెనీ దృష్టి సారించడం వంటి కారణాల వల్ల ఈ లేఆఫ్స్ అనివార్యంగా మారాయని కంపెనీ చెబుతోంది.

సివరెన్స్ ప్యాకేజీ వివరాలు:

లేఆఫ్స్‌లో జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు క్వాల్‌కామ్ అందిస్తున్న పరిహారం వివరాలు ఇవే..

1. బేసిస్ పే: తొలగించబడిన ఉద్యోగులకు కనీసం 2 వారాల గ్రాస్ జీతం బేసిస్ సెవరెన్స్ పేమెంట్‌గా అందజేస్తున్నారు.

2. సర్వీస్ కాలం ఆధారంగా: కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాడీకి అదనంగా 2 వారాల జీతాన్ని పరిహారానికి కలుపుతున్నారు. అలాగే పూర్తి కాని సంవత్సరాలకు కూడా ప్రో-రేటెడ్ ప్రాతిపదికన పేమెంట్ అందిస్తోంది కంపెనీ.

3. ఇన్సూరెన్స్: హెల్త్ కవరేజ్ కోసం లంప్-సమ్ (ఒకేసారి చెల్లించే) మొత్తాన్ని అందిస్తున్నారు.

4. త్వరగా సంతకం చేస్తే బోనస్: ఎగ్జిట్ డాక్యుమెంట్లపై రెండు లేదా మూడు రోజుల్లోగా సంతకం చేసే ఉద్యోగులకు అదనంగా మరో నెల జీతాన్ని అదనపు బోనస్‌గా ఇస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు