దీపావళి నుంచి భారత స్టాక్ మార్కెట్లు తమ లాభాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవటంతో మధ్యప్రాశ్చంలో యుద్ధానికి బ్రేకులు పడే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ రేట్లు నెమ్మదిగా దిగొస్తున్నాయి. ఈ కారణాలకు తోడు ఏఐ రంగంలోని చిప్ తయారీ స్టాక్స్ పతనం కూడా మన స్టాక్ మార్కెట్లకు ఉత్తేజంగా నిలుస్తున్నాయి. వీటన్నింటికి కార్పొరేట్ కంపెనీల అద్భుతమైన క్యూ2 ఫలితాలు తోడుకావటం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఉదయం 10.52 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1217 పాయింట్లు లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ సూచీ 321 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1351 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 692 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఇంట్రాడేలో ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడుగా ముందుకు సాగుతున్న వేళ ఫార్మా స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెుత్తంగా ఈ నెలలో జస్ట్ 10 రోజుల్లోనే నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఏకంగా 10 శాతం రాబడులను అందించి రికార్డుల మోత మోగించాయి.
మార్కెట్లలో బుల్స్ హవా కొనసాగటానికి మరో ముఖ్యమైన కారణం విదేశీ ఇన్వె్స్టర్లు తమ డబ్బును భారత స్టాక్ మార్కెట్లలోకి కుమ్మరించటం. ప్రధానంగా ఎన్వీడియో సీఈఓ అఫైర్ వ్యవహారం దుమారంతో ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ఆధారిత కంపెనీల షేర్ల నుంచి ఇన్వెస్టర్లు తమ సంపదను వెనక్కి తీసుకుంటూ వాటిని భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి తరలిస్తున్నారు. అలాగే అమెరికాలో ట్రంప్ పార్టీ ఓడిపోవటంతో డేటా సెంటర్ల చుట్టూ కొనసాగుతున్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తోందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతినిధి వికె విజయ్ కుమార్ పేర్కొన్నారు. మెుత్తానికి గ్లోబల్ మార్కెట్లలో కూడా సానుకూల వాతావరణం ఉండటం మన స్టాక్ మార్కెట్లకు కలిసొస్తోంది.
