రైలు పట్టాలు తప్పే ముందు భయంకరమైన క్షణాలు.. బ్రేకులు వేస్తూ లోకో పైలట్ అరిచిన వీడియో వైరల్!

 రైలు పట్టాలు తప్పే ముందు భయంకరమైన క్షణాలు.. బ్రేకులు వేస్తూ లోకో పైలట్ అరిచిన వీడియో వైరల్!

 అస్సాంలో  కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 13125)  పట్టాలు తప్పిన ఘటనలో షాకింగ్ వీడియో వైరలవుతోంది.  కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాలోని డిగారు రైల్వే స్టేషన్ దగ్గర  2026 నవంబర్ 11న (బుధవారం) జరిగినలో లాస్ట్ మినట్ వీడియో బయటకు వచ్చింది.  ఈ ప్రమాదంలో ఇంజిన్‌తో పాటు   ఏడు కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. 

 ఉదయం సుమారు 6:54 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మిజోరాంలోని సైరాంగ్ నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న ఈ రైలు డిగారు స్టేషన్‌లో మరో రైలుకు క్సాస్ చేయాల్సిన చోట ఆపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేగం అదుపు చేయలేక పట్టాలు తప్పినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) తెలిపింది.

లోకో పైలట్ క్యాబిన్‌లో భయంకరమైన క్షణాలు  

ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు లోకోమోటివ్ లోపల తీసినట్లు ప్రచారం అవుతున్న  ఒక వీడియో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది.  ఆ వీడియోలో లోకో పైలట్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పదే పదే ఆపరేట్ చేస్తూ, తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయినా రైలు వేగం తగ్గ లేదు.  

కుచ్ నహీ కామ్ కర్ రహా.. కుచ్ భీ కామ్ నహీ కర్ రహా హై (ఏమీ పనిచేయడం లేదు) అని గట్టిగా అరవటం  స్పష్టంగా  వినవచ్చు.  రైలు బ్యారికేడ్‌లను ఢీకొని బిగ్గరగా శబ్దం రావడం, ఇంజిన్ కంపించడం చూడవచ్చు. అయితే రైల్వే శాఖఈ వీడియోను అధికారికంగా ధృవీకరించలేదు. బ్రేకులు ఎందుకు పనిచేయలేదన్నది సాంకేతికంగా ఇంకా స్పష్టం కాలేదు.

రైల్వే అధికారుల స్పందన – రెస్క్యూ కొనసాగుతోంది  

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మతో పాటు  సీనియర్ అధికారులు స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి.  కొందరు ప్రయాణికులు గాయపడినట్లు, కొందరు క్రిటికల్ కండిషన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణనష్టం లేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని కూడా చెబుతున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రయాణికులను వేరే రైలులో పంపించారు. 

ఈ ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభమైంది. లోకో పైలట్ వేగం అదుపు చేయలేకపోవడమే కారణమని రైల్వే ప్రాథమికంగా పేర్కొన్నా, వైరల్ వీడియోలో కనిపించిన బ్రేక్ సమస్యపై మరిన్ని వివరాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.