ఇండోనేషియా వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నాలుగు రోజుల వార్షిక బోర్డు సమావేశాలు ఈరోజు (2026, నవంబర్ 11, బుధవారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. బోర్డు ఛైర్మన్ జై షా నేతృత్వంలో జరిగే ఈ మీటింగ్లో ప్రపంచ క్రికెట్ భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగే ఈ కీలక భేటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐసీసీ బోర్డు సభ్యులు, ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. ఈ 4 రోజులలో మొత్తం 8 ఐసీసీ కమిటీలు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై తుది ఆమోదం తెలుపనున్నాయి.
ఐసీసీ బోర్డు సమావేశాల ప్రధాన అంశాలు:
WTC 2027-29 & 2029-31 సైకిల్స్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) తదుపరి రెండు సైకిళ్లకు (2027-29, 2029-31) సంబంధించిన మ్యాచ్-అప్‌లు (షెడ్యూల్స్, సిరీస్‌లు) ప్రవేశపెట్టనున్నారు.
2028–35 ఐసీసీ ప్రధాన టోర్నీల విండోస్: 2028 నుంచి 2035 వరకు జరిగే అన్ని మెన్స్ ఐసీసీ టోర్నమెంట్‌ల (T20 World Cups, ODI World Cups, Champions Trophy) నిర్వహణ సమయాలు (Windows) ఆమోదం కోసం తెలిపనున్నారు.
ఫ్రాంచైజ్ లీగ్స్ నియంత్రణ (Franchise League Review):
* ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజ్ లీగ్‌లు (IPL, BBL, ILT20, SA20 మొదలైనవి) విపరీతంగా పెరిగిపోతుండటంతో, అంతర్జాతీయ క్రికెట్‌కు ఇబ్బంది కలగకుండా ఫ్రాంచైజీ లీగ్‌ల నిబంధనలను కఠినతరం చేయడంపై రివ్యూ గ్రూప్ తొలి నివేదికను ఇవ్వనుంది.
* ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ల అభివృద్ధి: ఆఫ్ఘనిస్తాన్ నిర్వాసిత మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేక డెవలప్‌మెంట్ పాత్‌వే ప్రోగ్రామ్ తదుపరి చర్యలను టాస్క్ ఫోర్స్ ఐసీసీ బోర్డుకు సమర్పించనుంది.
* ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు కీలకమైన వేదిక: ఐసీసీ బోర్డు సమావేశాల ప్రాముఖ్యతపై ఐసీసీ ఛైర్మన్ జై షా (Jay Shah) స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల డైరెక్టర్లు, సీఈఓలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా క్రికెట్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయడానికి, సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి ఈ సమావేశాలు ఒక అద్భుతమైన అవకాశం అని జై షా పేర్కొన్నాడు.
ఇండోనేషియాలో క్రికెట్ విప్లవం:
* క్రికెట్ వేగంగా విస్తరిస్తున్న ఇండోనేషియాలో ఈ సమావేశాలు జరగడం విశేషం.
* T20I రికార్డు: 2025లో ప్రపంచంలో ఏ దేశం ఆడనన్ని అత్యధిక అంతర్జాతీయ T20 మ్యాచ్‌లను ఇండోనేషియా పురుషుల జట్టు ఆడింది.
* ఆసియా కప్ ఎంట్రీ: ఇండోనేషియా సీనియర్ మహిళల జట్టు ఈ ఏడాదే ఆసియా కప్‌లోకి అడుగుపెట్టగా, U-19 మహిళల జట్టు తొలిసారి ఆసియా కప్‌కు అర్హత సాధించింది.
* బాలి అంతర్జాతీయ మైదానం: ఇండోనేషియా ప్రస్తుతం బాలి ఇంటర్నేషనల్ ఓవల్ స్టేడియాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ 2027లో ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.
