రైల్వే టీటీఈ ల విధులేంటీ.. రైలు ఎక్కిన ప్రయాణికుల దగ్గర టికెట్లు ఉన్నాయా లేదా చెక్ చేయడం లేకుంటే వారికి జరిమానా విధించడం.. కానీ ఓ టీటీఈ చేసిన పనితో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అంతేకాదు రైల్వే డిపార్టుమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది. ప్రయాణికుల పట్ల ఆమె ప్రవర్తనకు సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేసింది. యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్ లో జరిగిన ఓ ఘటనలో ప్రయాణికుడిని అవమానించిన టీటీఈ వీడియో నెట్టింట ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఝాన్సీలోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా TTE ప్రయాణికులను అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రైల్వే శాఖ ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది.
నవంబర్ 8న బెంగళూరు-న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ లో లక్నో నివాసి శ్రవణ్ కుమార్ అనే ప్రయాణికుేడు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
శ్రవణ్ కుమార్ ..మరో ఇద్దరితో కలిసి నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండ నుంచి స్లీపర్ క్లాస్ టికెట్లతో రైలులో ఎక్కారు. వారి టికెట్లు వెయిటింగ్ లిస్ట్ 2, 3, 4 నంబర్లలో ఉండి, చార్ట్ తయారీ తర్వాత ఇద్దరికి S-2 కోచ్‌లో RAC సీట్లు, మూడో వ్యక్తికి సీట్ నంబర్ 47 కేటాయించారు. ఝాన్సీ చేరుకున్న తర్వాత TTE టికెట్లు చూపించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీఈ అడిగిందని శ్రవణ్ తెలిపారు. తన బ్యాగ్‌లో వెతికే సమయంలో టికెట్ వెంటనే దొరకలేదని, అయినా తనకు చెల్లుబాటయ్యే టికెట్ ఉందని, బుకింగ్ వివరాలు రైల్వే సిస్టమ్‌లో చూడవచ్చని TTE కి చెప్పినా ఆమె వినలేదని ప్రయాణికుడు వాపోయాడు.
TTE తనకు సమయం ఇవ్వకుండా సిబ్బంది ముందే దూషించిందని ప్రయాణికులు ఆరోపించారు. చివరకు టికెట్ కనుగొని చూపించిన తర్వాత కూడా వాగ్వివాదం కొనసాగిందని, చదువులేిని మూర్ఖులు ..నాముందు నుంచి వెళ్లిపోండి అంటూ దూషించిందని ఫిర్యాదు చేశారు.
వైరల్ వీడియోలో TTE నువ్వు అంగుఠాఛాప్ అని అరుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బిజీగా లేకుండా ఉంటే నేను ఏం చేయగలనో చూపించేదాన్ని" అని కూడా వార్నింగ్ ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది.
శ్రవణ్ ఈ వీడియోను X లో పోస్ట్ చేసి రైల్వే అధికారులను ట్యాగ్ చేశారు. దీంతో ఝాన్సీ రైల్వే డివిజన్ PRO మనోజ్ కుమార్ సింగ్ స్పందించారు. TTE ని వెంటనే సస్పెండ్ చేసి విచారణ ఆదేశించినట్లు, తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినట్లు పోస్ట్ చేశారు.
ప్రయాణికులతో దురుసుగా వ్యవహరించే సిబ్బందికి ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తున్నామని, ప్రయాణికులను గౌరవంగా చూసుకోవాలని వారికి గుర్తుచేస్తున్నామని PRO చెప్పారు.
झांसी रेलवे स्टेशन पर टिकट दिखाने में थोड़ी देरी हुई… और महिला TTE यात्री पर भड़क गईं। वीडियो में उन्होंने यात्री को अंगूठाछाप कहा और बोला कि उसकी शक्ल से नफरत है। यात्री का आरोप है कि TTE ने स्टाफ के सामने अपमानित किया और स्टेशन से बाहर जाने को कहा। रेलवे प्रशासन ने मामले को गंभीरता से लिया। महिला TTE को तत्काल सस्पेंड कर दिया गया और विभागीय जांच शुरू कर दी गई। थोड़ी सी तमीज भी सीख लेनी चाहिए। टिकट चेक करना काम है… यात्री को अपमानित करना नहीं। आजकल ज्यादातर सरकारी कर्मचारी खुद को तीस मार खान समझने लगे हैं। किसी भी सरकारी ऑफिस में चले जाओ… 80% कर्मचारियों में बदतमीजी ही मिलेगी। SBI वालों की तो बात ही अलग है। ये मानसिकता कब बदलेगी? नौकरी सेवा के लिए है… रौब झाड़ने के लिए नहीं।
— Rajveer 🌟 (@Rajveerks) November 11, 2026
