విమానాశ్రయంలో బంతి భోజనం చేయడం.. విమానాన్ని ఆర్టీసీ బస్సులా భావించడం.. చివరికి రైలు భోగీని వివాహాది కార్యాలకు వాడుకోడం.. మన ఇండియన్స్ కే సాధ్యమేమో. ఇలాంటి ఘటనలు ఎన్నో వైరల్ అయ్యాయి. లేటెస్టుగా ఒక గుజరాత్ ఫ్యామిలీ రైలును వంటగదిలా మార్చుకుని.. వంటలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. 2026 నవంబర్ 10వ తేదీన X వేదికగా షేర్ అయిన ఈ వీడియోలో, సూరత్‌కు చెందిన ఒక కుటుంబం 3AC కంపార్ట్‌మెంట్‌లో వంట చేస్తున్న వీడియో బయటికొచ్చింది. మిడిల్ బెర్త్, పక్కనున్న సీట్లపై న్యూస్‌పేపర్లు పరిచి, శాండ్‌విచ్‌లు తయారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వీడియోలో మహిళలు బ్రెడ్ ముక్కలు పేర్చి, కూరగాయలు అమర్చి, చట్నీ రాసి శాండ్‌విచ్‌లు తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక మహిళ, ఎలెక్ట్రిక్ టోస్టర్ తెచ్చుకోవాల్సింది, గ్రిల్ చేసుకోవచ్చు కదా అని వ్యంగ్యంగా అనటం హైలైట్ గా నిలిచింది.
ఈ కామెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెర్త్‌పై వంట చేయడమే వివాదాస్పదంగా ఉండగా, టోస్టర్ ప్రస్తావన దానికి మరింత కామెడీని జోడించిందని అంటున్నారు.
దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని కామెడీగా తీసుకుంటే మరికొందరు తోటి ప్రయాణికుల పట్ల గౌరవం లేదు.. వాళ్లకు ఇబ్బంది కలుగుందన్న ఆలోచన కూడా లేదని విమర్శించారు.
రైల్వే చట్టం 1989 , వర్తించే రైల్వే భద్రతా నిబంధనల ప్రకారం రైలు కంపార్ట్‌మెంట్‌లలో వంట చేయడం నిషేధం. ప్రయాణికులు, సామాను, విద్యుత్ పరికరాలు దగ్గరగా ఉండే పరిమిత స్థలంలో అగ్ని ప్రమాదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఈ నిబంధన చెబుతోంది.
ముఖ్యంగా ఎలెక్ట్రిక్ టోస్టర్ వంటి వేడి పరికరాలు వాడటం రైల్వే నిబంధనలకు విరుద్ధం. రైలు కోచ్‌లు వంటశాలలకు అనుగుణంగా తయారు చేయలేదు. అలాంటి పరికరాలు ఉపయోగిస్తే అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది. తోటి సహప్రయాణికులకు ముప్పు కలిగించే అవకాశం ఉంది.
ఇంటి నుండి తయారుచేసిన ఆహారం రైళ్ళలో తీసుకెళ్ళడం సాధారణ విషయమే. అయితే కోచ్ లోపలే తయారు చేయడం నిబంధనలకు వ్యతిరేకమని చెబుతున్నారు.
I can't defend my gujarat 😭🤦 This family of surat posted on Instagram that they were travelling in 3AC compartment They're making food on middle berth even this lady is saying that we could have bring electric toaster for making sandwiches https://t.co/7Jt4dGtQ68
— તીખો ઘુઘરો #̢̛ͥ̀̽̽ͨ̌̓͆̇̀̽ͦͨͫͯ̏̎̇̈̚͜҉̕͢͏͡҉̸̶̛͢͡ (@7Npatel) November 10, 2026
