న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేకు గిల్, రాహుల్ దూరం.. భారత్ ప్లేయింగ్ XI ఇదే? 

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేకు గిల్, రాహుల్ దూరం.. భారత్ ప్లేయింగ్ XI ఇదే? 

IND vs NZ 4th ODI: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మరో హై-వోల్టేజ్ పోరుకు రెడీ అయింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా (2026, నవంబర్ 13, శుక్రవారం) మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేలో ఆతిథ్య కివీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇండియన్ టీమ్ 2–0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా, మూడో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

సిరీస్ పై టీమిండియా నజర్: 

మూడో మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా సిరీస్ కోల్పోయే ప్రమాదం తప్పింది. ప్రస్తుతం 2–0 ఆధిక్యంలో ఉన్న ఇండియన్ టీమ్, చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు సిరీస్‌ను అధికారికంగా కైవసం చేసుకుంటుంది. మరోవైపు, లాస్ట్ రెండు మ్యాచ్‌లు గెలిచి పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ తీవ్రంగా శ్రమిస్తోంది.

టీమిండియాలో భారీ మార్పులు: 

* టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అన్షుల్ కాంబోజ్ చివరి రెండు వన్డేలకు దూరమయ్యారు.

* కొత్త కెప్టెన్: శుభ్‌మన్ గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత వన్డే జట్టును నాయకత్వం వహించనుండగా, ఇషాన్ కిషన్ వైస్ కెప్టెన్‌గా (డిప్యూటీ) వ్యవహరించనున్నాడు.

* జట్టులో మార్పులు: తిలక్ వర్మ, యశ్ ఠాకూర్, కుమార్ కుశాగ్ర కొత్తగా జట్టులోకి వచ్చారు.

తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కేనా?: 

రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్నారు. ఐదో స్థానం కోసం రుతురాజ్ గైక్వాడ్, తెలుగు తేజం తిలక్ వర్మ మధ్య పోటీ నెలకొంది. రుతురాజ్‌కే ఎక్కువ అవకాశాలు ఉండటంతో తిలక్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లుగా నమన్ ధీర్, అక్షర్ పటేల్ ఆడనుండగా.. పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ బాధ్యతలు పంచుకోనున్నారు. నాలుగో పేసర్ కోసం మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్ మధ్య తీవ్ర పోటీ ఉంది.

►ALSO READ | న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే.. భారత జట్టులో ఏకంగా 6 మార్పులు? కొత్త ఓపెనర్లు వీళ్లే!

నాలుగో వన్డేకు భారత తుది జట్టు అంచనా: 

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ / తిలక్ వర్మ, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, మహమ్మద్ సిరాజ్ / యశ్ ఠాకూర్.