ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీస్ కూడా చేరుకున్నారు. ఈ క్రమంలో అనిరుధ్, కావ్యకు డైమండ్ రింగ్ తొడిగి ప్రపోజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
ఈ వీడియోలో అనిరుధ్‌ను పోలిన వ్యక్తి, కావ్యను పోలిన యువతి చేతులు పట్టుకుని అందమైన గ్రీక్ లొకేషన్లో నడుస్తూ కనిపిస్తారు. అనంతరం ఆమెను సరదాగా తిప్పి, ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మెరిసిపోతున్న డైమండ్ రింగ్‌ను బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఆమె వేలికి ఉంగరం తొడగారు. అయితే ఇది నిజమైన ప్రపోజల్ వీడియోనేనా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'అనీ తన ప్రేమకథకు తానే సంగీతం అందించాడు' అంటూ ఓ యూజర్ చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది.
అయితే ఈ వీడియోను షేర్ చేసిన ఒరిజినల్ అకౌంటే ఇది ఏఐతో రూపొందించిన వీడియో అని స్పష్టం చేసింది. అంటే అనిరుధ్ నిజంగా కావ్యకు ప్రపోజ్ చేసిన దృశ్యం కాదన్నమాట. కేవలం పెళ్లి వార్తల నేపథ్యంలో క్రియేట్ చేసిన ఏఐ వీడియో మాత్రమే. ఇక గ్రీస్‌లో జరగుతున్న వీరి పెళ్లి వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కూడా ఎయిర్ పోర్ట్ లో ఉన్న వీడియోలు, ఫొటోలు నెట్టింట వెరల్ అయ్యాయి.. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా తెలపలేదు.
►ALSO READ | Chiranjeevi-Prabhas Combo: చిరంజీవి టాక్ షోలో ప్రభాస్ .. నెట్‌ఫ్లిక్స్ 'మెగావర్స్'లో క్రేజీ కాంబో!
మరోవైపు నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ హోటల్లో రిసెప్షన్ జరగనుందని సమాచారం. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ఈ జంట రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారు. మరి గ్రీస్ లో జరుగుతున్న డెస్టినేషన్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియో ఎప్పుడు వస్తాయో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ani literally composed his own love story 🥹❤️💍 #AnirudhKavyaWedding #Anirudh https://t.co/4ksGcy2gd2
— Anirudh FC (@AnirudhfansTN) November 10, 2026
