బాక్సాఫీస్ వద్ద నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినిపిస్తేనే చాలు ఫ్యాన్స్ లో ఫుల్ మాస్ జోష్ మొదలవుతుంది. ఇక ఆయన సినిమాలో డ్యాన్స్ చేస్తూ, తన గొంతుతో పాట పాడితే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి క్రేజీ సర్‌ప్రైజ్‌తో బాలయ్య అభిమానులను ఖుషీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ తదుపరి చిత్రం 'దాదా నుంచి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య నటుడిగానే కాకుండా గాయకుడిగానూ అలరించబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
'దాదా' నుంచి తొలి పాట 'దాదా ధమాకా' నవంబర్ 13, 2026న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటను ఫుల్ మాస్ బీట్‌తో రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ సాంగ్‌లో బాలకృష్ణ స్వయంగా కొన్ని లైన్స్ పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే బాలయ్య వాయిస్‌లో రికార్డ్ చేసిన లైన్స్ అవుట్‌పుట్‌పై చిత్రబృందం సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ లైన్స్‌ను పాటలో ప్రత్యేకంగా హైలైట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
►ALSO READ | శర్వానంద్ 'భోగి'కి బ్రేకులు.. నవంబర్ 13న రిలీజ్ వాయిదా.. అసలు కారణమేంటంటే?
ఈ పాటలో బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహి కూడా బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారు. నోరా గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌కు బాలకృష్ణ మాస్ స్టెప్పులు తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డిసెంబర్ 24, 2026న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నవంబర్ 13న రాబోయే 'దాదా ధమాకా' పాట బాలయ్య మాస్ ఇమేజ్‌కు ఎలాంటి కొత్త ఊపు తీసుకొస్తుందో చూడాలి. మొత్తానికి ఈసారి బాలయ్య నుంచి డ్యాన్స్‌తో పాటు సింగింగ్ ట్రీట్ కూడా ఉండటంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
