వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని... ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసిన తల్లి..

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని... ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసిన తల్లి..

బెంగుళూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసింది ఓ తల్లి. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

బెంగుళూరుకు చెందిన విజయ్ తల్లి మీనా నారాయణ్ కలిసి ఉంటున్నారు. బ్యూటీ పార్లర్ మేనేజర్ అయిన మీనా నారాయణ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన రాకేష్ జమునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న విజయ్ మీనా నారాయణ్, రాకేష్ ల వివాహేతర సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.

ఈ క్రమంలో విజయ్ తమ రిలేషన్ కి అడ్డొస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.ఇందులో భాగంగా  కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు చూపిస్తామని విజయ్‌ని బెళగావికి రప్పించారు మీనా, రాకేష్.  నవంబర్ 1న హైవే పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో మీనా, రాకేష్, అతడి నలుగురు స్నేహితులు కలిసి విజయ్‌ని కర్ణాటక జెండాతో గొంతు నులిమి హత్య చేశారు.

►ALSO READ | 15 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు.. కుల్గామ్ లో CRPF క్యాంప్ పై ఉగ్రదాడి..!

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో మీనా, రాకేష్ ల కుట్ర బయటపడింది. విజయ్ ఫోన్లో కాల్ రికార్డింగ్స్ ద్వారా కుట్ర బయటపడిందని తెలిపారు పోలీసులు. విజయ్ తల్లి మీనా, ఆమె ప్రియుడు రాకేష్, స్నేహితులు సచిన్, మనోజ్, తమ్మన్న, ఏక్ నాథ్ లను అరెస్ట్ చేశారు.