టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి తన డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేసింది. సినిమాలతోనే కాదు.. తన స్టైలిష్ లుక్స్, అదిరిపోయే డ్యాన్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఈ రోజు ( నవంబర్ 11, 2026 ) శ్రీలంకలో సందడి చేసింది. కొలంబోలోని వెల్లవట్టే ప్రాంతంలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. పూజా హెగ్డే వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఈవెంట్ ప్రాంగణం అభిమానుల సందడితో కిక్కిరిసిపోయింది.
షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పూజా హెగ్డే తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. దళపతి విజయ్ నటించిన దళపతి విజయ్ 'బీస్ట్' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు - హలమతి హబిబో 'కు స్టెప్పులేస్తూ అందరినీ అలరించింది. అప్పట్లో ఈ పాట దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు పూజా మరోసారి అదే పాటకు డ్యాన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
►ALSO READ | Anirudh–Kavya Wedding : అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి సందడి.. గ్రీస్‌లో ప్రపోజల్ వీడియో వైరల్.. అసలు నిజమేంటంటే?
ఇక సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే చివరిగా 'జన నాయగన్' చిత్రంలో కనిపించింది. తెలుగులో మరికొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తానికి శ్రీలంకలో పూజా చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
