శర్వానంద్ 'భోగి'కి బ్రేకులు.. నవంబర్ 13న రిలీజ్ వాయిదా.. అసలు కారణమేంటంటే?

శర్వానంద్ 'భోగి'కి బ్రేకులు.. నవంబర్ 13న రిలీజ్ వాయిదా.. అసలు కారణమేంటంటే?

టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో సందడి చేయాల్సిన చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. యంగ్ హీరో శర్వానంద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'భోగి' రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్ . ఈ సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు రావడం లేదని అధికారికంగా ప్రకటించారు. దీంతో శర్వానంద్ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

రిలీజ్ వాయిదా..

తమకు ఎంతో ప్రత్యేకమైన సినిమా 'భోగి' అని.. భారీ అంచనాలతో, ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు. ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అయితే అనుకోని జాప్యాల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. సినిమా రిలీజ్‌పై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని ఫ్యాన్స్ ను కోరారు.

సెన్సార్ సమస్యలే కారణమా?

ఇదిలా ఉంటే ఇండస్ట్రీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా వాయిదా వెనుక సెన్సార్ సమస్యలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. దీంతో అసలు కారణమేంటన్నది ఆసక్తికరంగా మారింది.

భారీ తారాగణంతో.. 

కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్, ఎమోషన్స్‌తో సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన గత చిత్రాల తరహాలోనే మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ సన్నివేశాలు ఈ సినిమాలోనూ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.  అయితే విడుదలకు సిద్ధమైన సమయంలో 'భోగి' వాయిదా పడటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి శర్వానంద్ కొత్త రిలీజ్ డేట్‌తో ఎప్పుడు బాక్సాఫీస్ బరిలోకి దిగుతారో చూడాలి..