చైనా స్పైతో వివాహేతర సంబంధాల వివాదంతో ఎన్విడియా సీఈవో హువాంగ్ భవిష్యత్తుపై ఆ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ (గురువారం నవంబర్ 12) సమావేశం అవుతోంది. వివాహేతర సంబంధాలు,జాతీయ భద్రతా ఆరోపణల క్రమంలో ఎన్విడియా సీఈవో హువాంగ్ ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బోర్డు సిద్ధమవుతున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్, రియిటర్స్ వార్త కథనాలు వెల్లడించాయి. హువాంగ్‌ను తొలగించాల్సి వస్తే తాత్కాలిక సీఈవోను నియమించడం ,శాశ్వత వారసుడిని ఎంపిక చేయడం కోసం బోర్డు ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) తెలిపింది.
సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ (Megaspeed) సంస్థ ఎగ్జిక్యూటివ్ అలిస్ హువాంగ్‌తో (Alice Huang) తనకు సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ ఇప్పటికే అంగీకరించారు. ఆమె చైనా గూఢచారి అని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తుండటంతో ఈ అంశం జాతీయ భద్రతా వివాదంగా మారింది.
సీఈవో మార్పు వార్తల క్రమంలో ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు 8శాతం నుంచి 9శాతం వరకు పడిపోయాయి. ఈ వారం ప్రారంభమైన ఈ వివాదం వల్ల కంపెనీ మార్కెట్ విలువ సుమారు 600 బిలియన్ల డాలర్ల మేర ఆవిరైంది.గూఢచర్యం ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎన్విడియా బోర్డు ఇప్పటికే ప్రముఖ న్యాయ సంస్థ వాచ్‌టెల్, లిప్టన్, రోసెన్ & కాట్జ్ (Wachtell, Lipton, Rosen & Katz) ను నియమించింది.
1993లో ఎన్విడియాను స్థాపించినప్పటి నుంచి హువాంగ్ సంస్థను ఏఐ (AI) చిప్‌ల మార్కెట్‌లో అగ్రగామిగా నిలిపారు. నవంబర్ 17న కంపెనీ త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఈ నాయకత్వ సంక్షోభం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది.
