- వరంగల్ సిటీ పోలీస్కమీషనర్ శ్వేత
గ్రేటర్ వరంగల్, వెలుగు : వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ)లో నిర్వహిస్తున్న ఉత్కర్ష–2026 వార్షికోత్సవాలను పురస్కరించుకొని మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడండి’ అనే నినాదంతో బుధవారం కేఎంసీ ప్రిన్సిపాల్, విద్యార్థుల ఆధ్వర్యంలో హెల్త్ రన్, ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ప్రధాన ద్వారం నుంచి హన్మకొండ పోలీస్ కమిషనరేట్ వరకు నిర్వహించిన హెల్త్ రన్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకతీయ వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన 500 మందికి పైగా వైద్య, నర్సింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ద్వారా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. 500 మందికి పైగా విద్యార్థులు కలిసి మైదానంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కవిత, ఏసీపీ నర్సింగరావు పాల్గొన్నారు. కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ తదితరులు ఉన్నారు.
